logo

విశ్వహిందూ పరిషత్ బజరంగ్‌దళ్‌ నూతన కార్యవర్గం

దేశం, ధర్మం కోసం సంస్కృతి సంప్రదాయాలను, సమాజాన్ని రక్షించే విధంగా యువత పనిచేయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా సహసంయోజక్ వినోద్ అన్నారు.

Updated : 28 Apr 2024 17:07 IST

ఎల్లారెడ్డి పట్టణం: దేశం, ధర్మం కోసం సంస్కృతి సంప్రదాయాలను, సమాజాన్ని రక్షించే విధంగా యువత పనిచేయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా సహసంయోజక్ వినోద్ అన్నారు. ఎల్లారెడ్డి పురపాలక పరిధిలోని దేవునిపల్లిలో శనివారం రాత్రి విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా సిద్దిరాములు, కార్యదర్శి సందీప్, బజరంగ్ దళ్ సంయోజక్‌గా రేణిల్ కుమార్, సహ సంయోజక్‌గా రాజు, గోరక్షక్‌గా చిరంజీవి, సహ గోరక్షక్‌గా దత్తు, బలోపాసన ప్రముఖ్ శ్రీనివాస్, సభ్యులుగా అరుణ్, కొత్త దత్తు, భాస్కర్, రాకేష్‌లను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని