logo

ప్రచారానికి పొలంబాట

మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు.

Published : 29 Apr 2024 04:38 IST

మండే ఎండలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకే పరిమితమైన అభ్యర్థులు, నాయకులు ప్రస్తుతం మరింత జోరు పెంచారు. మండల కేంద్రాల్లో అన్ని పార్టీలు రోడ్‌షోలు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలం కావడంతో సాయంత్రం నుంచి రాత్రి వరకు మండల కేంద్రాల్లో రోడ్‌షోలతో ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రచారం చేయడానికి మాత్రం నాయకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. పొలాలు, ఉపాధిహామీ పనులు జరుగుతుండటంతో నాయకులకు గ్రామాల్లో ఓటర్లను కలిసే అవకాశం రావడం లేదు. దీంతో వారు ‘ప్రజల వద్దకే పాలన’ అన్నట్లు ప్రజలు పనిచేస్తున్న స్థలానికే వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ నాయకుడిని గెలిపించాలంటూ కోరుతున్నారు.


రాజకీయ పార్టీలనగానే ముందుగా గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులతో పాటు గుర్తులకూ ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో తొలి ఎన్నికల నుంచే పార్టీ గుర్తులను ప్రవేశపెట్టారు. అప్పట్లో ఓటర్లలో కేవలం 16శాతం మాత్రమే అక్షరాస్యులు ఉండడంతో అభ్యర్థుల పేర్లు చదవడం కష్టమని భావించిన అధికారులు అందరూ గుర్తుపట్టేలా చిహ్నాలు ప్రవేశపెట్టారు. ఈ గుర్తులను గీయడానికి ఎన్నికల సంఘం ఎంఎస్‌ సేథీ అనే చిత్రకారుడిని నియమించింది. 1951 నుంచి 1992 వరకు ఆయన ఎన్నో వేల చిత్రాలు పెన్సిల్‌తో గీశారు. కొన్ని సాంకేతిక మార్పులతో ఇప్పటికీ ఇవే గుర్తులను ఎన్నికలకు వాడుతున్నారు.  

 న్యూస్‌టుడే, మోర్తాడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని