logo

nzb: ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధి కూలీలు

ఉపాధి హామీ పథకం సీనియర్‌ మేట్‌ నాగరాజు పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్‌ ఎంపీడీవో కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు.

Published : 29 Apr 2024 11:41 IST

బీర్కూర్‌ : ఉపాధి హామీ పథకం సీనియర్‌ మేట్‌ నాగరాజు పనితీరును నిరసిస్తూ సోమవారం బీర్కూర్‌ ఎంపీడీవో కార్యాలయాన్ని కూలీలు ముట్టడించారు.  పనిప్రదేశం నుంచి నేరుగా  500 మంది కూలీలు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు. సీనియర్‌ మేట్‌ నాగరాజు పనిప్రదేశంలో తమకు తాగునీరు, టెంట్లు తదితర సదుపాయాలను కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన వారికి కాకుండా, పనిచేయని వారికి వేతనాలు ఇస్తున్నారని ఆరోపించారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన కూలీలకు పని కల్పించకుండా వెనక్కి పంపించడంతో  5 కి.మీటర్ల దూరం నడుచుకుంటూ ఇంటికి వస్తున్నామన్నారు. అనంతరం ఏపీవో అక్మల్‌ను నిలదీశారు.  సీనియర్‌ మేట్‌ నాగరాజును విధుల నుంచి తొలగించి కొత్తవారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో మండల  కాంగ్రెస్‌ నాయకులు ఉపాధి హామీ కూలీలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా కూలీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని