logo

బిజదలో చేరిన గణేశ్వర్‌, లేఖాశ్రీ

ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి గణేశ్వర్‌ బెహరా ఆదివారం శంఖ భవన్‌ (బిజద కార్యాలయం)లో పార్టీ నేతల సమక్షంలో బిజదలో చేరారు. రాజ్యసభ ఎంపీలు సస్మిత్‌పాత్ర్‌, మానస్‌మంగరాజ్‌, ఇతర నాయకులు ఆయనను స్వాగతించారు.

Published : 08 Apr 2024 02:23 IST

భాజపా, కాంగ్రెస్‌లకు గట్టి దెబ్బ

సస్మిత్‌ పాత్ర్‌, ఇతర నేతల సమక్షంలో గణేశ్వర్‌ బెహరా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన మాజీ మంత్రి గణేశ్వర్‌ బెహరా ఆదివారం శంఖ భవన్‌ (బిజద కార్యాలయం)లో పార్టీ నేతల సమక్షంలో బిజదలో చేరారు. రాజ్యసభ ఎంపీలు సస్మిత్‌పాత్ర్‌, మానస్‌మంగరాజ్‌, ఇతర నాయకులు ఆయనను స్వాగతించారు. 2024 ఎన్నికల్లో తాను ఎలాగైనా గెలవాలన్న ధ్యేయంతో ఉన్నానని, కాంగ్రెస్‌లో ఉంటే అది సాధ్యం కాదని భావించి హస్తాన్ని వదిలేసినట్లు ఆయన ఇటీవల తెలిపారు. కేంద్రపడ జిల్లాలో అగ్రనేతగా గుర్తింపు ఉన్న ఆయన ఉద్దేశపూర్వకంగా బిజదకు దగ్గరయ్యారు. ముఖ్యమంత్రి ఆయనకు అసెంబ్లీ టికెట్‌ ఖరారు చేసే అవకాశం ఉంది.

ఆమె ఫైర్‌ బ్రాండ్‌

భాజపా ఉపాధ్యక్షురాలు లేఖాశ్రీసామంత శింగార్‌ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే శంఖభవన్‌కు చేరుకుని బిజదలో చేరారు. కమలంలో ఫైర్‌ బ్రాండ్‌గా ముద్రపడిన ఆమె దశాబ్దకాలంగా నవీన్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. ఆమె పార్టీ వీడడం భాజపాకు షాక్‌గా చెప్పవచ్చు. తాను దీర్ఘకాలంగా భాజపాకు సేవలు చేసినా గుర్తింపు కరవైందని లేఖాశ్రీ విలేకరుల వద్ద ఆమె వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని