logo

ప్రభుత్వ లాంఛనాలతో డొంబురు ధర దహన సంస్కారాలు

మాజీ మంత్రి కాంగ్రెస్‌ నాయకుడు డొంబురు ధర ఉలక(87)దహన సంస్కారాల కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వగ్రామం బంకిలిలో జరిగింది.

Updated : 16 May 2024 20:41 IST

రాయగడ గ్రామీణం: మాజీ మంత్రి కాంగ్రెస్‌ నాయకుడు డొంబురు ధర ఉలక(87)దహన సంస్కారాల కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వగ్రామం బంకిలిలో జరిగింది. ఉలక రాజధాని భువేనేశ్వర్‌లో ఒక ప్రేవేట్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఉలక మృత దేహానికి పీసీసీ కార్యాలయంలో పార్టీ నేతలు జాతీయ పతాకం కప్పి పూలమాలలు వేసి పార్టీ సీనియర్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. బంకిలిలో  పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం అనంతరం మృతుడు డొంబురు ధర కుమారుడు నీల మాధవ దహన సంస్కారాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఉలక అన్న కుమారుడు కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక తోపాటు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని