logo

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

బ్రహ్మపురలోని పురాతన సిటీ హైస్కూల్లో 1971 సంవత్సరం మెట్రిక్యులేషన్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగింది.

Published : 30 Apr 2024 04:56 IST

  చిత్రంలో డాక్టర్‌ జమ్ముల నారాయణరావు తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని పురాతన సిటీ హైస్కూల్లో 1971 సంవత్సరం మెట్రిక్యులేషన్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగింది. ధర్మనగర్‌లోని ఫారెస్ట్‌ పార్కు సమీపాన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం సమన్వయకర్తలు పూడిపెద్ది సత్యనారాయణ (బాబు), డాక్టర్‌ జమ్ముల నారాయణ రావు పాల్గొని వివిధ అంశాలను వివరించారు. హాజరైన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు జమ్ముల శైలజ క్విజ్‌, సరదా ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మాట్లాడుతున్న పూడిపెద్ది సత్యనారాయణ (బాబు). 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని