logo

ఎంపీ అభ్యర్థినిగా కొత్తపల్లి గీత నామినేషన్‌

జిల్లాలో సోమవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు పార్లమెంటరీ స్థానానికి ఐదు, కురుపాం శాసనసభకు రెండు, పార్వతీపురం, పాలకొండ శాసనసభలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి.

Published : 23 Apr 2024 03:53 IST

ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌కు నామపత్రాలు అందిస్తున్న గీత, చిత్రంలో కేంద్ర మంత్రి

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో సోమవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు పార్లమెంటరీ స్థానానికి ఐదు, కురుపాం శాసనసభకు రెండు, పార్వతీపురం, పాలకొండ శాసనసభలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. అరకు ఎంపీ అభ్యర్థినిగా కూటమి నుంచి కొత్తపల్లి గీత (భాజపా) జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌కుమార్‌కు నామపత్రాలు అందజేశారు. ఈమెతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే పాల్గొన్నారు.

మోదీని ప్రధానిని చేద్దాం..

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని గెలిపించి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని కేంద్ర మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం దేశం వైపు చూసేలా చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి గీత మాట్లాడుతూ స్కామ్‌ల వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థి విజయచంద్ర, భాజపా జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, తెదేపా రాష్ట్ర  అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీశ్‌, నాయకులు ఎస్‌.ఉమామహేశ్వరరావు, ఎ.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని