logo

ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు

రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు.

Published : 29 Apr 2024 05:21 IST

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద మానవహారం

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. ఆదివారం విజయనగరం నగరపాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దాసన్నపేటలోని ప్రధాన కూడలి నుంచి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. తామంతా ఎన్నికల్లో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేశారు. ఓటు విశిష్టతను వివరించారు. వచ్చేనెల 9 వరకు అన్ని డివిజన్లలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సీవో ఈశ్వరరావు, ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని