logo

దిబ్బలపాలెంలో పులి సంచారం..?

భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 18 May 2024 03:38 IST

దిబ్బలపాలెం సమీపంలో స్థానికులు గుర్తించిన పాదముద్రలు
భోగాపురం, న్యూస్‌టుడే: భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయిదు రోజుల కిందట పులితో పాటు పిల్లకూన పాదముద్రలను గుర్తించామని చెబుతున్నారు. విమానాశ్రయ పనుల ప్రాంతంలో జనసంచారం ఉంటుందని, అక్కడికి వచ్చే అవకాశం లేదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో గుర్తించిన పాదముద్రలను బట్టి పులివనే స్థానికులు నమ్ముతున్నారు. దీనిపై రెవెన్యూ, అటవీశాఖ అధికారులను వివరణ కోరగా ఇప్పటివరకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని, అక్కడి వెళ్లి పరిశీలిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని