logo
Published : 02/12/2021 05:36 IST

నడిరేయి వరకూ నిషా...

మద్యం అక్రమ అమ్మకాలు... ఆ కారణంగా తలెత్తుతున్న ఇబ్బందికర పరిస్థితులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యద్దనపూడి మండలం పూనూరులో ఇరవై మందికి పైగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మందుబాబులకు అవసరమైన నీరు, సోడాలు, మాంసాహారం వంటివి అందించేందుకు ప్రత్యేకంగా దుకాణాలు సైతం ఏర్పాటయ్యాయి. అర్ధరాత్రి దాటాక కూడా ఇవి కొనసాగుతుండడంతో అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. మార్టూరు కూరగాయల మార్కెట్‌ సమీపం, కొణిదెనరోడ్డు, బలరాంకాలనీ, ద్రోణాదుల, జొన్నతాళి, వలపర్ల ప్రాంతాల్లో అనధికారిక విక్రయాలు సాగుతున్నాయని ఆయా ప్రాంతాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా రాత్రి వేళ అటుగా వెళ్లాలంటేనే మహిళలు భయపడుతున్నారని వాపోతున్నారు. విషయాన్ని సెబ్‌ సీఐ యశోధరాదేవి దృష్టికి తీసుకువెళ్లగా... తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- న్యూస్‌టుడే, యద్దనపూడి, మార్టూరు

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని