logo

‘ఫులే చూపిన బాటలో పయనిద్దాం’

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే కృషిచేశారని.. ఆయన స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు.

Published : 29 Nov 2022 02:17 IST

ఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌,

మేయర్‌ గంగాడ సుజాత, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే కృషిచేశారని.. ఆయన స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ అన్నారు. ఫులే వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కొత్తకూరగాయల మార్కెట్‌లోని విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబాటుతనాన్ని అధిగమించేందుకు విద్యే కీలకమని గుర్తించి.. ఆ దిశగా ఫులే విశేష కృషిచేశారని కొనియాడారు. జిల్లాలో బడుగు, బలహీన వర్గాల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని కలెక్టర్‌ అన్నారు. ఆయా వర్గాల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత, బీసీ సంక్షేమశాఖ అధికారిణి అంజల, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, డీఆర్డీఏ పీడీ బాబూరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని