logo

పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి

పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

Published : 19 Apr 2024 03:13 IST

పోతురాజు కాలువ నిండా ప్లాస్టిక్‌ భూతం

పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గతంలో కాలువ పనులు పేర్నమిట్ట నుంచి శ్రీరామ్‌ కాలనీ వరకు సాగాయి. జయప్రకాశ్‌ కాలనీ వద్ద కాలువకు ఇరువైపులా పనులు చేస్తుండగా, ఇళ్లు దెబ్బతిన్నాయి. కాంక్రీట్‌ గట్టు సైతం కూలిపోయింది. ఆ తర్వాత అర్ధాంతరంగా వదిలేయడంతో గడ్డి పెరిగిపోయి నీరు ముందుకు కదలకుండా మరో మూసీ నదిలా మారింది. దోమలు పెరిగి నగరవాసులు వ్యాధుల బారిన పడుతున్నారు.

ఈనాడు, ఒంగోలు

 

కమ్మపాలెం వద్ద కాలువలో భారీ ఎత్తున పెరిగిన గుర్రపు డెక్క

వినాయక కాలనీ వద్ద గతంలో పోతురాజు కాలువ గట్టు, ఫ్లోరింగ్‌ పనులు చేసిన చిత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని