logo

ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం

తర్లుపాడు మండలంలో తుమ్మలచెరువులో  శనివారం కందు నారాయణరెడ్డి ప్రచారం చేట్టారు. ప్రచారరథంపై రెండు రోజులుగా తర్లుపాడు మండలంలో పర్యటిస్తున్నారు.

Published : 28 Apr 2024 04:29 IST

తర్లుపాడు : ప్రచారంలో కందుల

తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి : తర్లుపాడు మండలంలో తుమ్మలచెరువులో  శనివారం కందు నారాయణరెడ్డి ప్రచారం చేట్టారు. ప్రచారరథంపై రెండు రోజులుగా తర్లుపాడు మండలంలో పర్యటిస్తున్నారు. ప్రతి వ్యక్తి ఈసారి ఎన్నికల్లో ఓట్లు ఆలోచించి వేయాలని కోరారు.  ‌్ర కొనకనమిట్ల మండలంలోని చింతగుంట తెదేపా మండల అధ్యక్షుడు బాబురావు ఆధ్వరంలో శనివారం 10 కుటుంబాలు వైకాపా వీడి తెదేపాలో చేరారు.

  • పొదిలి కొత్తూరు విశ్వనాదపురం, నిర్మలాకాన్వెంట్‌వీధిలో శనివారం తెదేపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పెద్దారవీడు, యర్రగొండపాలెం పట్టణం  పెద్దారవీడు మండలంలోని మల్లవరం గ్రామంలో శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని తెదేపా అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు.

  • తెదేపా అభ్యర్థి ఎరిక్షన్‌బాబు కుమార్తె డాక్టర్‌ చెల్సియా యర్రగొండపాలెం పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

గిద్దలూరు పట్టణం, కంభం, : ఎన్‌డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. గిద్దలూరు నగర పంచాయతీలోని రైల్వేస్టేషన్‌ రహదారి, రాచర్ల రహదారిలో ఇంటింటి ప్రచారం చేపట్టారు.  ఆయన సమక్షంలో యాచవరం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు, గిద్దలూరుకు చెందిన వేములపాటి చెన్నయ్య ఆద్వర్యంలో ప్రైవేటు ఎలక్ట్రికల్‌ కార్మికులకు చెందిన 20 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

  • కంభం పట్టణంలోని జయప్రకాశ్‌ వీధి, మేదర బజార్‌ తదితర ప్రాంతాల్లో శనివారం ముత్తుముల అశోక్‌రెడ్డి తనయుడు దివ్యేష్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని