logo

గొంతెండుతున్న పల్లెలు

నీటి ఎద్దడితో పల్లెల గొంతెండుతోంది. మండలంలోని పామూరిపల్లె, బాదినేనిపల్లె ఎస్సీ కాలనీ, హనుమంతరాయునిపల్లె గ్రామాల్లో నీటికి కటకటలాడుతున్నారు.  పామూరిపల్లె ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా ట్యాంకు వాల్వు మరమ్మతులకు గురికావడంతో నీరు ఎక్కక నీరంతా వృథా అవుతోంది.

Published : 28 Apr 2024 04:31 IST

వాల్వు నుంచి వచ్చే నీటిని పట్టుకుంటున్న మహిళ

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే:  నీటి ఎద్దడితో పల్లెల గొంతెండుతోంది. మండలంలోని పామూరిపల్లె, బాదినేనిపల్లె ఎస్సీ కాలనీ, హనుమంతరాయునిపల్లె గ్రామాల్లో నీటికి కటకటలాడుతున్నారు.  పామూరిపల్లె ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా ట్యాంకు వాల్వు మరమ్మతులకు గురికావడంతో నీరు ఎక్కక నీరంతా వృథా అవుతోంది. కాలనీలోని సుమారు 50 కుటుంబాలు ఆ లీకేజీ నీటిని పట్టుకుంటున్నారు. అధికారులకు తెలిపిన స్పందన లేదని కాలనీవాసులు వాపోతున్నారు. * బాదినేనిపల్లె ఎస్సీ కాలనీలో ఉన్న సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్తు నీటి పథకం ఆరు నెలల కిందట మరమ్మతుకు గురైంది. నేటికీ మరమ్మతుకు నోచుకోకపోవడంతో గ్రామంలోకి వచ్చి నీటిని తీసుకెళ్లాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.  కొమరోలు పంచాయతీ హనుమంత రాయునిపల్లెలో నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలోని సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్తు నీటి పథకం మరమ్మతులకు గురైందని దీంతో అవస్థలు తప్పటం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

కాలనీలోని నీటి పధకం మరమ్మతులకు గురికావడంతో పాఠశాల వెనుక వైపు ఉన్న 20 కుటుంబాల వారు నీటి కోసం ట్యాంకు వద్దకు వచ్చి నీటిని తీసుకొని వెళుతున్నాం. పశువులు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. కుళాయిలు నీరు రాకపోవడంతో అవి అలంకారప్రాయంగా మారాయి. ట్యాంకుకు వెళ్లే పైపుకు ఉన్న వాల్వును మరమ్మతులు చేస్తే నీరు కుళాయిలకు వస్తాయి.

మేరమ్మ, పామూరిపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని