logo

వానొస్తే కుంట.. ఎండొస్తే కళ్ల మంట

జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి పట్టణాలతో పాటు శ్రీశైలానికి వెళ్లాలంటే ఈ ఒంగోలు - కర్నూలు రోడ్డే గత్యంతరం. నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఈ బాటను ముఖ్యమంత్రి జగన్‌ నిర్లక్ష్యంగా వదిలేశారు.

Published : 28 Apr 2024 04:40 IST

ఇవీ జగన్‌ సార్‌ రోడ్లు

చిన్నపాటి వర్షమొస్తే ఎల్లయ్య కంకర మిల్లుల వద్ద ఇదీ పరిస్థితి (పాత చిత్రం)

ఈనాడు, ఒంగోలు: జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి పట్టణాలతో పాటు శ్రీశైలానికి వెళ్లాలంటే ఈ ఒంగోలు - కర్నూలు రోడ్డే గత్యంతరం. నిత్యం వేలాదిమంది ప్రయాణించే ఈ బాటను ముఖ్యమంత్రి జగన్‌ నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇక ఈ రోడ్డులో చీమకుర్తి - మర్రిచెట్లపాలెం మధ్య ఎల్లయ్య కంకర మిల్లుల వద్ద పరిస్థితి మరీ దుర్భరం. వానొస్తే చెరువును తలపిస్తోంది. ఎండొస్తే దుమ్ము రేగి కనుచూపు మేరలో ఏమీ కన్పించదు. ధూళి పడి కళ్లమంటలతో విలవిల్లాడాల్సిందే. వర్షాలు కురిసిన తర్వాత స్థానిక మిల్లుల వారు కంకర, బూడిదతో అక్కడి గుంతలు నింపేసి చేతులు దులుపుకుంటున్నారు. చోదకులు గాయాల పాలవ్వడం..నిత్యకృత్యంగా మారింది. కొత్త రోడ్డును నిర్మించాలని జిల్లావాసులు ఎప్పటినుంచో కోరుతున్నా పాలకుల చెవికెక్కడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని