logo

వైకాపా ప్రచారంలో క్షేత్రసహాయకుడు

ఎన్నికల కోడ్‌ ఉంటే మాకేమిటి అన్నట్లుగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా రాజకీయ నాయకులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

Published : 28 Apr 2024 04:44 IST

అన్నారాంబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఉపాధి క్షేత్రసహాయకుడు అబ్దుల్‌ కరీంఖాన్‌

తర్లుపాడు, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ ఉంటే మాకేమిటి అన్నట్లుగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా రాజకీయ నాయకులతో కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న పి.అబ్దుల్‌ కరీంఖాన్‌ శనివారం రాత్రి వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం రాజకీయ ప్రచారం రాత్రి 10.00 గంటలతో ముగించాల్సి ఉండగా శనివారం తుమ్మలచెరువులో 11.00 వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజనాలు తయారు చేశారు. ఉపాధి హామీ క్షేత్రసహాయకుడు దగ్గర ఉండి భోజనం తయారు చేయించారు. అంతేకాకుండా వైకాపా అభ్యర్థి అన్నా రాంబాబును ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని గ్రామంలో చక్కర్లు కొట్టారు. అంతే ఉపాధి హామీ కూలీలను తాను చెప్పినట్టు ఓట్లు వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు క్షేతగాత్రుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని