logo

కార్మికులకు మద్దతుగా ధర్నాలు

శ్యాంక్రగ్‌ పిస్టన్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28, 29 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలని సీˆఐటీయూ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.సురేష్‌బాబు, పి.తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు.

Published : 23 Jan 2022 03:52 IST

మాట్లాడుతున్న తేజేశ్వరరావు, చిత్రంలో సీఐటీయూ జిల్లా నాయకులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: శ్యాంక్రగ్‌ పిస్టన్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28, 29 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలని సీˆఐటీయూ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.సురేష్‌బాబు, పి.తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సంఘ జిల్లాస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రణస్థలం మండలంలోని శ్యాంక్రగ్‌ పిస్టన్స్‌ అండ్‌ రింగ్స్‌ లిమిటెడ్‌కు చెందిన రెండో ప్లాంట్ పరిధిలోని 600 మంది కార్మికులు గడిచిన 65 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ నేటీకీ యాజమాన్యం ముందుకు రావడం లేదని విమర్శించారు. సమావేశంలో సీˆఐటీయూ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని