logo

తెదేపాలోకి వరం కుటుంబం

Published : 29 Apr 2024 05:54 IST

శ్రీకాకుళం: పురపాలిక మాజీ ఛైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతికి తెదేపా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న
ఎంపీ రామ్మోహన్‌నాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌

గుజరాతీపేట(శ్రీకాకుళం), సారవకోట, కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. వైకాపా నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ దివంగత అంధవరపు వరహానరసింహం(వరం) కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుజరాతీపేటలోని వారి గృహంలో ఆదివారం వరం కుమార్తె పురపాలిక మాజీ ఛైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి, కుమారులు వరప్రసాద్‌, సంతోష్‌ తెదేపా శ్రీకాకుళం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కె.రామ్మోహన్‌నాయుడు, అభ్యర్థి గొండు శంకర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. వారితో పాటు కళింగ కోమట్ల సామాజిక వర్గానికి చెందిన 500 కుటుంబాలు వైకాపాను వీడాయి. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకుడు చింతల రామకృష్ణ, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. బీ సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు జవైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు కండువా వేసి ఆయనను తెదేపాలోకి ఆహ్వానించారు. బీ టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల్లో పలు గ్రామాలకు చెందిన వైకాపా శ్రేణులు 500 మంది నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

కోటబొమ్మాళి: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన గుంటజగన్నాథపురం వైకాపా నాయకులు, కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని