MK Stalin: మాటల్లో కాక, చేతల్లో చూపిద్దామని..! : స్టాలిన్
మాటలు తగ్గించి చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ఆహా ఓటీటీ తమిళ వెర్షన్ ప్రారంభ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్లో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ముఖ్య అ
ఓటీటీని ప్రారంభిస్తున్న స్టాలిన్. చిత్రంలో అల్లు అరవింద్, భారతిరాజా, ఉదయనిధి తదితరులు
కోడంబాక్కం, న్యూస్‌టుడే: మాటలు తగ్గించి చేతల్లో చూపిద్దామని నిర్ణయించుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ఆహా ఓటీటీ తమిళ వెర్షన్ ప్రారంభ కార్యక్రమం చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్లో గురువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఈ ఓటీటీ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. తమిళం కోసం అయితే నేను ఏ సమయంలోనైనా వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నా. ఈ ఓటీటీ పేరు కూడా ఆహా అని ఉంది. చాలా సంతోషంగా ఉన్నప్పుడు ‘ఆహా’ అంటారని అందరికీ తెలుసు. సమాజానికి ఉపయోగపడేవిధంగా ఈ ఆహా పనిచేయాలని కోరుకుంటున్నా. అందరికీ ‘సిత్తిరై తిరునాళ్’ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ దర్శకుడు భారతిరాజా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తడి నేలలపై అంతులేని నిర్లక్ష్యం
[ 03-05-2024]
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న నగరాలు, ప్రాంతాలు రాష్ట్రంలో ఎక్కువే. వాటినుంచి కాపాడే సత్తా ఉన్న చిత్తడినేలలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఫలితంగా కొన్ని అన్యాక్రాంతమవడంతో పాటు ఆక్రమణలకు గురవుతున్నాయి. -
ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ
[ 03-05-2024]
ఆలయ ఉత్సవాల్లో ఒక వర్గం వారు ప్రార్థన చేయడానికి నిరాకరించడంతో ఏర్పడిన ఘర్షణ భారీ విధ్వంసానికి దారి తీసింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని ఓమలూరు సమీపం తీవట్టిపట్టి వద్ద హిందూ దేవాదాయ శాఖ -
డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు
[ 03-05-2024]
మెట్రో రెండో దశ మార్గంలో రానున్న డ్రైవరు రహిత రైళ్లలో అధునాతన వసతులు సమకూరనున్నాయి. బోగీల్లో ఆనుకుని కూర్చునేందుకు వీలుగా సీట్లు, డ్రైవర్ల వీక్షణ (డ్రైవర్స్ వ్యూ), సెల్ఫోన్లకు ఛార్జింగు వంటి పలు సదుపాయాలతో బోగీ నిర్మాణం జరగనుంది. -
నేపథ్య గాయని ఉమా రమణన్ కన్నుమూత
[ 03-05-2024]
నేపథ్య గాయని ఉమా రమణన్(71) ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నై అడయారులోని నివాసంలో బుధవారం రాత్రి 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఆమె భర్త రమణన్ వెల్లడించారు. -
కర్ణాటక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం
[ 03-05-2024]
కావేరి జలాల వ్యవహారంలో కర్ణాటక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. తేనాంపేటలోని కామరాజర్ ఆడిటోరియంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. -
దుర్గాస్టాలిన్ బోటు షికారు
[ 03-05-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంతో పాటు కొడైకెనాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. బుధవారం సాయంత్రం కొడైకెనాల్ చెరువులో స్టాలిన్ సతీమణి దుర్గాస్టాలిన్ పడవ సవారీ చేశారు. -
సర్పాలతో జాగ్రత్త!
[ 03-05-2024]
వేసవి ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సర్పాలు ఖాళీ స్థలాలు, గృహాలలోకి చొరబడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ సూచిస్తోంది. -
దాహార్తి తీరుస్తున్న నెమ్మెలి నిర్లవణీకరణ పథకం
[ 03-05-2024]
రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలు తీర్చేందుకు పూండి, పుళల్, చెంబరంబాక్కం, చోళవరం, వీరాణం చెరువు నుంచి దక్షిణ చెన్నై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. -
స్వీయ కాన్పుతో బిడ్డను చంపుకొన్న నర్సుపై హత్యయత్నం కేసు
[ 03-05-2024]
సన్నిహితుడి ద్వారా గర్భవతి అయిన ఓ నర్సు స్వీయ కాన్పునకు యత్నించి బిడ్డను చంపిన ఘటనలో నగర పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
అజిత్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం : జయకుమార్
[ 03-05-2024]
నటుడు అజిత్‌కుమార్ రాజకీయాల్లో వస్తే స్వాగతిస్తామని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్‌రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్