logo

మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ముఖ్యం

మానసిక ఆరోగ్యంపై విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఐఐటీఎంలో  బుధవారం జరిగింది. ‘నేషనల్‌ హెల్త్‌ మిషన్‌’ (ఎన్‌హెచ్‌ఎం),  రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది.

Published : 21 Apr 2023 01:06 IST

వడపళని, న్యూస్‌టుడే: మానసిక ఆరోగ్యంపై విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఐఐటీఎంలో  బుధవారం జరిగింది. ‘నేషనల్‌ హెల్త్‌ మిషన్‌’ (ఎన్‌హెచ్‌ఎం),  రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటైంది.  ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఎలా తగ్గించుకోవాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ డైరెక్టరు శిల్పా ప్రభాకర్‌ సతీష్‌ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ప్రభుత్వ సేవలను కొనియాడారు.  పాఠశాల, కళాశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు.  గత ఏడాది అక్టోబరులో ప్రారంభమైన ‘నట్పుడన్‌ ఉంగలోడు-మననల సేవ’, ‘టెలె మానస్‌’ సేవల గురించి వివరించారు. ప్రభుత్వం ప్రారంభించిన ‘మన నల నల్లాత్తరవు మండ్రం’ (మనమ్‌) కార్యక్రమం విద్యార్థులలో మార్పునకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. నీట్‌  రాసేవారికి ఒత్తిడి తగ్గిస్తోందని చెప్పారు. ఐఐటీ కూడా  ‘ఎంఐటీఆర్‌’ పేరుతో  విద్యార్థులకు మంచి ధైర్యాన్ని కల్పించింది. ఐఐటీ విద్యార్థులకు టెలె మనస్‌ (14416) టోల్‌ ఫ్రీ నెంబరు ద్వారా 24 గంటలూ కౌన్సెలింగ్‌ ఇస్తోంది. ‘ఫెలోషిప్‌ కోర్సు’ ద్వారా కూడా ఈ వసతి కల్పిస్తోంది. ఐఐటీ డైరెక్టర్‌ వి.కామకోటి మాట్లాడుతూ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించి, మానసికంగా ధైర్యంగా ఉండేందుకు తమ విద్యా సంస్థ పలు రకాలైన చర్యలు చేపడుతోందన్నారు. ఈ సందర్భంగా behappy.iitm.ac.in వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. మద్రాస్‌ మెడికల్‌ కళాశాల డాక్టర్‌ ఎం.మలైయప్పన్‌ ‘యాన్‌ ఇంట్రోడక్షన్‌ టు పాజిటివ్‌ మెంటల్‌ హెల్త్‌’, ‘ఎర్లీ ఐడెంటిఫికేషన్‌్ ఆఫ్‌ డిప్రెషన్‌’పై మద్రాస్‌ మెడికల్‌ కళాశాల డాక్టర్‌ ఎంఎస్‌ జగదీశన్‌ ప్రసంగించారు. డాక్టర్‌ ఆర్‌.కార్తీక్‌ దైవనారాయణన్‌, డాక్టర్‌ వి.దివ్య మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు