logo

ఓటేసేందుకు 25 కి.మీ. నడక

తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు.

Published : 19 Apr 2024 00:12 IST

నడుచుకుంటున్న వస్తున్న ఇంజిక్కుళి గ్రామస్థుడు

టీనగర్‌, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. ప్రారంభంలో వంద కుటుంబాలకు పైగా నివసిస్తుండగా కనీస వసతులు లేక చాలామంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఏడు కుటుంబాల వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో గ్రామం నుంచి సుమారు 25 కి.మీ. దూరంలోని కరయారు డ్యామ్‌ సమీపం గ్రామ పంచాయితీ పాఠశాల వద్ద పోలింగ్‌కేంద్రంలో ఓటేస్తుంటారు. కరయారు డ్యామ్‌ దాటుకుని రావాల్సి ఉంది. ఓటు వేసేందుకు ఆహారం మూట కట్టుకుని రెండు రోజుల ముందే బయలుదేరినట్లు తెలిపారు. ప్రచారానికి ఎవరూ రాలేదని, అభ్యర్థులు ఎవరనే విషయం కూడా తమకు తెలియదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని