logo

అట్టడుగుకు రాజధాని

చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్‌శాతం అట్టడుగుకు చేరింది.

Published : 20 Apr 2024 00:36 IST

అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదు

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై జిల్లాలో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చితే రాజధాని చెన్నైలో పోలింగ్‌శాతం అట్టడుగుకు చేరింది. ఎన్నికల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ప్రచారాలు చేసినా పూర్తిస్థాయి ఫలితం కనిపించలేదు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించడం, ఎండలు మండిపోవడం తదితర ఘటనలు కూడా పోలింగ్‌ శాతంపై ప్రభావం చూపించినట్టు ఓటర్లు చెబుతున్నారు. జిల్లాల్లోని ఉత్తర చెన్నై, మధ్య చెన్నై, దక్షిణ చెన్నై నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం మందకొడిగానే ప్రారంభమైంది. ముగిసే సమయానికి ఉత్తర చెన్నైలో 69.26 శాతం, మధ్య చెన్నైలో 67.35, దక్షిణ చెన్నైలో 67.82 శాతం నమోదైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై ఉత్తర నియోజకవర్గంలో 64.24, చెన్నై మధ్య నియోజకవర్గంలో 58.96, చెన్నై దక్షిణ నియోజకవర్గంలో 57.05శాతం పోలింగ్‌ నమోదైంది. చెన్నై ఉత్తర నియోజకవర్గం మినహాయించి మిగతా రెండు స్థానాల్లో పోలింగ్‌ శాతం పెరగడం గమనార్హం.మధ్య చెన్నై నియోజకవర్గంలోని స్టెల్లా మేరిస్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌కు ఒకే కుటుంబానికి చెందిన 21 మంది సభ్యులు వచ్చారు. వారిలో ఓటర్లు 15 మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని