logo

త్యాగానికి చిహ్నం కాషాయం

కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. దూరదర్శన్‌ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్‌ పేజీలో స్పందించారు.

Published : 23 Apr 2024 01:06 IST

తమిళిసై

సైదాపేట, న్యూస్‌టుడే: కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. దూరదర్శన్‌ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్‌ పేజీలో స్పందించారు. ఆల్‌ ఇండియా రేడియోకు ఆకాశవాణి అనే సంస్కృత పేరు ఎందుకు పెట్టారని స్టాలిన్‌ అడిగారని, ఆ పేరు కాంగ్రెస్‌ హయాం నుంచే ఉందన్నారు. మీ కుటుంబ ఛానల్‌ అయిన సన్‌ టీవీ పేరును తమిళంలోకి ఎప్పుడు మారుస్తారని ప్రశ్నించారు. డీడీ పొదిగై అనే పేరును డీడీ తమిళ్‌ అని మార్చి తమిళానికే గౌరవం తెచ్చారని తెలిపారు. కాషాయం అనేది త్యాగానికి ప్రతీక అని చెప్పారు. ఆ రంగులోకి దూరదర్శన్‌ లోగోను మార్చడం తప్పుకాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని