logo

పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్‌

రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్‌ తెలిపారు.

Published : 23 Apr 2024 07:57 IST

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్‌ తెలిపారు. రాజకీయాల్లోకి వస్తానని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలో దిగుతానని విశాల్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన హరి దర్శకత్వంలో ‘రత్నం’ అనే సినిమాలో నటిస్తున్నారు. చిత్రీకరణకు ఆయన సోమవారం సేలం విచ్చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన వసతులు పూర్తిస్థాయిలో కల్పించలేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిని అందివ్వాలన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే అని ఏ పార్టీని విమర్శించడం లేదని చెప్పారు. పార్టీలు మంచి చేస్తే తాను  రాజకీయాల్లోకి రానవసరం లేదని తెలిపారు. నటుల సంఘం భవనాన్ని ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భవనానికి విజయకాంత్‌ పేరు పెట్టడంపై జనరల్‌ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని