logo

అన్నాడీఎంకే నేత ఎస్టేట్‌లో వన్యప్రాణుల వేట

అన్నాడీఎంకే నేత సజీవన్‌కు చెందిన సిల్వర్‌ క్లైవ్డ్‌ ఎస్టేట్‌ కూడలూర్‌లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్‌లో పనిచేస్తున్న ఫైజల్‌, సాబు జాకబ్‌ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.

Updated : 24 Apr 2024 06:56 IST

నిందితుడి కోసం గాలింపు

స్వాధీనం చేసుకున్న కత్తులు, తుపాకులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే నేత సజీవన్‌కు చెందిన సిల్వర్‌ క్లైవ్డ్‌ ఎస్టేట్‌ కూడలూర్‌లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్‌లో పనిచేస్తున్న ఫైజల్‌, సాబు జాకబ్‌ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.... సజీవన్‌, అతని స్నేహితులు తరచూ ఎస్టేట్‌కు వచ్చి వన్యప్రాణులను వేటాడి వండుకుని తింటారని, వేటకు రెండు తుపాకులు, గొడ్డళ్లను కొనుగోలు చేశారని, ఇటీవల ఓ జింకను వేటాడి వండుకుని తిన్నట్లు తెలిపారు. రెండు వారాల క్రితం అడవి దున్నను వేటాడి వండుకుని తిన్నట్లు పేర్కొన్నారు. అధికారులు రెండు తుపాకులు, పదికి పైగా తూటాలు, గొడ్డళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫైజల్‌, సాబు జాకబ్‌, ఎస్టేట్‌ మేనేజరు పరమన్‌ని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. పరారీలో ఉన్న సజీవన్‌, శ్రీకుమార్‌, సుభైర్‌ కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది. కోడానాడు కేసుకు సంబంధించి సజీవన్‌ని పోలీసులు పలుమార్లు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని