logo

అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి

అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు హసీనా సయ్యద్‌ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. 

Published : 24 Apr 2024 00:07 IST

హసీనా సయ్యద్‌

విలేకర్లతో మాట్లాడుతున్న హసీనా సయ్యద్‌

చెన్నై, న్యూస్‌టుడే: అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు హసీనా సయ్యద్‌ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడుతూ... భారతీయ మహిళల తాళి సంస్కృతిని కించపరిచేలా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఖండించదగినవని తెలిపారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి వ్యతిరేకంగా భాజపా ఉందన్నారు. మణిపుర్‌లో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన ఘటనలకు భాజపా జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ ఇప్పటివరకు నోరు విప్పలేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ వంటివారూ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా బిల్లును త్వరగా అమలు చేయాలని డిమాండ్‌ చేయనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌లో విజయధరణికి సముచిత స్థానం కల్పించారని, అయినా ఆమె అత్యాశ పడటంతోనే భాజపాలో చేరారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని