logo

స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా 2.5 లక్షల ఎల్‌ఎల్‌ఆర్‌లు

‘లెర్నర్స్‌ లైసెన్స్‌’ (ఎల్‌ఎల్‌ఆర్‌), వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను స్పీడ్‌ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ’ విభాగం పేర్కొంది.

Published : 28 Apr 2024 00:37 IST

వడపళని,  న్యూస్‌టుడే: ‘లెర్నర్స్‌ లైసెన్స్‌’ (ఎల్‌ఎల్‌ఆర్‌), వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను స్పీడ్‌ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)కు లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ల కోసం నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో కొత్త విధానంపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించిన స్పీడ్‌ పోస్టు ద్వారా 2.5 లక్షల ఎల్‌ఎల్‌ఆర్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను పంపామని రాష్ట్ర రవాణా, రోడ్డు భద్రతా కమిషనరేట్ సీనియర్‌ అధికారి ఒకరన్నారు. తపాలా శాఖతో గత ఏడాది ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో 91 ఆర్టీఓ కార్యాలయాలు, 45 మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టరు కార్యాలయాలున్నాయి. ఎల్‌ఎల్‌ఆర్‌లు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను త్వరితగతిన అందజేసేందుకు కమిషనరేట్ వివిధ రకాల చర్యలు చేపడుతోంది. లైసెన్సు కోసం కార్యాలయాలకు రాకుండా వారిళ్లవద్దకే చేర్చాలనేది పథకం లక్ష్యం. మార్చిలో 2,51,501 ఎల్‌ఎల్‌ఆర్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు పంపగా 2,48,986 మందికి వారి చిరునామాకు సక్రమంగా చేరాయి. 2,500 మంది తమకు అందలేదని ఫిర్యాదులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు