ఏపీఎస్‌ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు

ఏపీఎస్‌ ఆర్టీసీ (APSRTC) రిజర్వేషన్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సర్వర్‌ తరచూ మొరాయిస్తోంది.

Updated : 11 May 2024 12:17 IST

విజయవాడ: ఏపీఎస్‌ ఆర్టీసీ (APSRTC) రిజర్వేషన్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సర్వర్‌ తరచూ మొరాయిస్తోంది. శనివారం ఉదయం నుంచే సమస్య ఉన్నా అధికారులు పరిష్కరించలేదు. టికెట్లు బుక్‌ చేసుకునేందుకు విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూస్తూ అవస్థలు పడుతున్నారు. అక్కడి రిజర్వేషన్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. బస్సులు లేకపోవడం, టికెట్లు జారీ కాకపోవడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని