logo

రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్‌ఐఏ దర్యాప్తు

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో గత నెల బాంబు పేలుడు సంభవించింది.

Published : 28 Apr 2024 00:43 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టయిన అబ్దుల్‌ మదిన్‌ దాహాని చెన్నై ట్రిప్లికేన్‌కి తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ట్రిప్లికేన్‌లోని ఓ లాడ్జి, ఓ పాత భవనం వద్దకు తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని