logo

వాహనాలపై స్టిక్కర్లు అంటించడంపై నిషేధం

ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు నిషేధం విధించారు.

Published : 29 Apr 2024 00:13 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు నిషేధం విధించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో... సొంత వాహనాల నెంబరు ప్లేట్లపై స్టిక్కర్లు లేదా మరేదైనా గుర్తుల ఆకారంలో తమ శాఖ గుర్తుని తెలియజేయడం ద్వారా వ్యక్తులకు, సంబంధిత శాఖలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు పేర్కొంది. చెన్నై సహా చాలా చోట్ల ప్రైవేటు వాహనాలపై పత్రిక, సెక్రటేరియెట్‌, పోలీసు, ఆర్మీ మొదలైన పేర్లు కనిపిస్తున్నాయని, నేరాలకు పాల్పడే వారు ఇలాంటి స్టిక్కర్లను తప్పుగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. కావున ఇలాంటి పేర్లు, గుర్తులను వాహనాలపై నుంచి తొలగించడానికి మే 1 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే మే 2 నుంచి మోటారు వాహనాల చట్టం కింద తగిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని