logo

ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి

ఎన్నికల కమిషన్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తెలిపారు.

Published : 29 Apr 2024 00:15 IST

ఎల్‌.మురుగన్‌

విలేకర్లతో మాట్లాడుతున్న ఎల్‌.మురుగన్‌

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: ఎన్నికల కమిషన్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తెలిపారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ... నీలగిరి జిల్లాలో ఈవీఎంలు పెట్టిన స్ట్రాంగ్‌ రూం సీసీ కెమెరాల మానిటర్‌లు 20 నిమిషాలు పని చేయలేదన్నారు. సాంకేతిక కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు చెప్తున్నారని, ఎన్నికల కమిషన్‌ తప్పకుండా దీన్ని గమనించాలని పేర్కొన్నారు. ఏ కారణమూ చెప్పకుండా 24 గంటలూ సక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యవేక్షించాలని తెలిపారు. ఓటరు జాబితాలో పలువురి పేర్లు గల్లంతయ్యాయని, ముఖ్యంగా భాజపా ఓటర్ల పేర్లు లేకుండా పోయాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించిందన్నారు. ఈవీఎంల గురించి ఎన్నికల కమిషన్‌ పలుమార్లు వివరించినా కాంగ్రెస్‌ మళ్లీ మళ్లీ ఆరోపణలు చేయడం ఓటమి భయంతోనేనని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ అయోధ్యకు వెళ్లి పూజలు చేయనని చెప్తున్నారని, ఆయన హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారా? లేక దేవుడిని ద్వేషిస్తున్నారా? అన్నది తెలియజేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని