logo

ఉక్కులో ప్రమాదం

విశాఖ ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ బ్యాటరీ-5 ఛాంబర్‌-19లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది.

Published : 24 Mar 2023 05:45 IST

ప్రమాదంలో ధ్వంసమైన హాట్‌ కోక్‌ బకెట్‌

విశాఖపట్నం (ఉక్కునగరం), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ బ్యాటరీ-5 ఛాంబర్‌-19లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. సుమారు 25 టన్నుల హాట్‌ కోక్‌తో పైకి వెళ్తున్న బకెట్‌కు ఉన్న ఐరన్‌ రోప్‌ తెగిపోవడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది. ఈ ఘటనలో బకెట్‌ పూర్తిగా ధ్వంసమై.. కోక్‌ మొత్తం నేలపాలైంది. బకెట్‌ ఖరీదు రూ.1.70 లక్షలు ఉంటుందని, ఇతర పరికరాలు, కోక్‌ విలువ కలిపితే దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని యాజమాన్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రమాద సమయంలో కార్మికులెవరూ సమీపంలో లేకపోవడంతో... పెనుముప్పు తప్పింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని