logo

మహిళల ఓటుతో వైకాపాకు గుణపాఠం: శ్రీభరత్‌

వైకాపా దుష్టపాలనను అంతమొందించడానికి మహిళలు సంఘటితం కావాలని      విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు.

Published : 28 Apr 2024 04:11 IST

మాట్లాడుతున్న తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, పక్కన పల్లా, కూటమి నాయకులు... హాజరైన మహిళలు

గాజువాక, న్యూస్‌టుడే : వైకాపా దుష్టపాలనను అంతమొందించడానికి మహిళలు సంఘటితం కావాలని      విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం గాజువాక తెదేపా కార్యాలయం వద్ద తెలుగు మహిళలు, భాజపా, జనసేన మహిళా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీభరత్‌ మాట్లాడుతూ... మహిళల సంక్షేమాన్ని, భద్రతను గాలికి వదిలేసిన వైకాపాకు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. మద్య నిషేధం హామీపై మాట మార్చిన జగన్‌మోహన్‌రెడ్డిని ఇంటికి సాగనంపాలన్నారు. గాజువాక తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... కూటమి మహిళా కార్యకర్తలంతా ఐక్యంగా పని చేసి.. తెదేపా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనరు కరణంరెడ్డి నర్సింగరావు, మహిళా నాయకులు ఎస్‌.అనంతలక్ష్మి, ప్రమీలపట్నాయక్‌, పద్మ, షాలినీ, రత్నం, మధులత, స్వరూపారాణి, రాంబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని