logo

అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత

తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు.

Published : 29 Apr 2024 04:19 IST

పేటలో రొయ్యల వ్యాపారి వద్ద ప్రచారం చేస్తున్న అనిత

పాయకరావుపేట, న్యూస్‌టుడే: తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఓటర్లను కలిశారు. కరపత్రాలు పంచారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేటను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామని చెప్పారు. అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తామని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెదేపా మండల శాఖ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు, జనసేన నాయకుడు తోట నగేష్‌, పెదిరెడ్డి శ్రీను, పల్లా విలియంకేరీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని