logo

ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్‌

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 30 Apr 2024 03:49 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. మే నెలలో జిల్లాకు మంజూరైన పింఛన్లలో 1,22,278 మందికి రూ.36.68 కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందజేస్తామని చెప్పారు. మిగిలిన 42,621 మందికి రూ.13.09 కోట్లు ఇళ్ల వద్ద పంపిణీ చేస్తామన్నారు. డీబీటీ ద్వారా ఎవరికైనా మే 2వ తేదీలోపు అందకపోతే మే 3న నగదు రూపంలో ఇళ్ల వద్దే అందజేస్తామని చెప్పారు. లబ్ధిదారులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని