logo

పార్టీ కోసం మెట్టు దిగా: పైలా

ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 03:53 IST

సమావేశంలో మాట్లాడుతున్న పైలా ప్రసాదరావు, పక్కన బండారు సత్యనారాయణమూర్తి, సీఎం సురేశ్‌ తదితరులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను సోమవారం ఉపసంహరించుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సూచన మేరకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం రమేశ్‌, బండారు సత్యనారాయణమూర్తి విజయానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు దేవరాపల్లిలో నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌, తెదేపా అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే మాడుగుల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో స్కిల్‌ డెవలప్‌మెంటు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతుల పండించిన పంటలు నిల్వ చేసుకోడానికి కోల్డు స్టోరేజీలను నిర్మించాలని సీఎం రమేశ్‌ను కోరినట్లు చెప్పారు. జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు రాయపురెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని