logo

రేపటి నుంచి జిల్లాలో బండి సంజయ్‌ యాత్ర

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం అర్ధరాత్రి జిల్లాకు చేరుకోనుంది. సోమవారం దేవరుప్పుల మండలం సీతారాంపురం నుంచి యాత్ర మొదలుకానుంది. రూట్‌ మ్యాప్‌ షెడ్యూల్‌ ప్రకారం

Published : 14 Aug 2022 05:58 IST

జనగామ అర్బన్‌, దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం అర్ధరాత్రి జిల్లాకు చేరుకోనుంది. సోమవారం దేవరుప్పుల మండలం సీతారాంపురం నుంచి యాత్ర మొదలుకానుంది. రూట్‌ మ్యాప్‌ షెడ్యూల్‌ ప్రకారం దేవరుప్పుల మండలం నుంచి పాలకుర్తి, లింగాలఘనపురం, జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌ మండలాల్లోని పలు తండాలు, గ్రామాల మీదుగా సాగనుంది. బండి సంజయ్‌ మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. ప్రతి రోజు 13 కి.మీ నుంచి 15 కి.మీ చొప్పున తొమ్మిది రోజులపాటు సుమారు 150 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. ఆయా మండలాల పరిధిలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాత్రి బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులు..

జిల్లాలో ఈ నెల 15న నుంచి మొదలై, 22న జఫర్‌గఢ్‌ మండలంలోని కూనూర్‌తో జిల్లాలో పాదయాత్ర ముగియనుంది. ఇందుకోసం యాత్ర సాఫీగా, సజావుగా జరిగేలా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జోనల్‌ ఇన్‌ఛార్జులతోపాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జులను నియమించారు. జనగామ నియోజకవర్గానికి వెంకటరమణి, వీరెల్లి చంద్రశేఖర్‌రావు, పాపారావు, పాలకుర్తి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, గంగిరెడ్డి, ఎర్రం మహేశ్‌, లేగ రాంమోహన్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, దేశ్‌పాండే తదితరులు పాదయాత్రకు ప్రబారీలుగా వ్యవహరించనున్నారు. వీరు తమ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తారు. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని