logo

సరయుకు సరిలేరు!

వరంగల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన వేల్పుల సరయు చదరంగంలో అంతర్జాతీయ వేదికలపై విజయాలను సొంతం చేసుకుంటున్నారు

Published : 01 Aug 2023 05:06 IST

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే : వరంగల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన వేల్పుల సరయు చదరంగంలో అంతర్జాతీయ వేదికలపై విజయాలను సొంతం చేసుకుంటున్నారు. జులై 24 నుంచి 30 వరకు స్పెయిన్‌ దేశంలోని పొంటేవేద్ర నగరంలో నిర్వహించిన గ్రాండ్‌మాస్టర్‌ ఓపెన్‌ టోర్నీలో ఎలాంటి అంచనలు లేకుండా బరిలోకి దిగిన సరయూ ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. ఒకేసారి మూడు నామ్స్‌ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ నామ్‌, ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నామ్‌, మెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నామ్స్‌ను కొల్లగొట్టింది. అక్కడి నుంచి జులై 31 నుంచి ఆగస్టు 5వ వరకు పోర్చుగల్‌లో జరుగుతున్న మరో అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్‌ టోర్నీకి హాజరయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో 1845 రేటింగ్‌లో కొనసాగుతోంది. మరో రెండు నామ్స్‌ సాధిస్తే ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను అందుకుంటుంది. ఈ హోదా సాధిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హోదా సాధించిన ఘనత ఆమె సొంతం అవుతుంది. హైదరాబాద్‌లోని వెలాసిటి చెస్‌ అకాడమీలో కోచ్‌ కృష్ణతేజ వద్ద ఆమె శిక్షణ తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని