logo

రసీదులకు అదనపు రుసుం..!

ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated : 19 Apr 2024 05:11 IST

మీ-సేవ కేంద్రంలో ఇచ్చిన బిల్లు 

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే : ఆస్తిపన్ను చెల్లించిన పౌరులకు తాత్కాలికంగా పొట్టి(చిన్న) రసీదులు ఇస్తున్నారు. పెద్ద రసీదులివ్వమని అడిగితే అదనంగా రూ.2 ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అంతర్జాలంలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే పన్ను చెల్లించిన వారికి కచ్చితంగా రసీదు ఇవ్వాలి. ఈ విధానాన్ని గ్రేటర్‌ వరంగల్‌ పన్నుల విభాగం అమలు చేయడం లేదు. గురువారం హనుమకొండ ప్రాంతం సుబేదారికి చెందిన పౌరుడు 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించారు. డెబిట్‌ కార్డు(ఏటీఎం)తో హ్యాండ్‌ డివైజ్‌ మిషన్‌ పన్ను చెల్లించగా.. అతనికి చిన్న రసీదు ఇచ్చారు. వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పేరుతో ముద్రించిన పెద్ద రసీదు ఇవ్వాలని బల్దియాకు చెందిన మీ-సేవ కేంద్రం ఉద్యోగులను అడిగితే.. రెండు రూపాయలు అదనంగా చెల్లించాలన్నారు. హనుమకొండ నక్కలగుట్ట సర్కిల్‌ కార్యాలయంలో కాజీపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ రవీందర్‌, ఆర్వో సుదర్శన్‌ను సదరు పౌరుడు సంప్రదించగా.. పెద్ద రసీదులు ఇచ్చారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లోని బల్దియాకు చెందిన అన్ని ఈ-సేవ కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చిన్న రసీదులు వద్దు.. పెద్దవి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని