logo

వెనక్కి తగ్గను.. ఎన్నికల బరిలో నిలుస్తా..

తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠకు తెర తీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు తెదేపా అధిష్ఠానం కేటాయించంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Published : 28 Feb 2024 03:22 IST

ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు స్పష్టీకరణ

శివరామరాజుకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్న ఎమ్మెల్యే

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠకు తెర తీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ స్థానాన్ని సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు తెదేపా అధిష్ఠానం కేటాయించంతో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదని పేర్కొన్నారు. నా పేరు ప్రస్తావించిన పార్టీ శ్రేణులను ఆయన బెరించారని.. తన ఫ్లెక్లీలను ధ్వంసం చేయించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన తెదేపా- జనసేన ఆత్మీయ సమావేశానికి గాని, తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగే సభకు గాని తనకు ఆహ్వానం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధతతో పని చేసిన తనను పార్టీ అవమానించిందన్నారు. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల బరిలో నిలుస్తానని.. అది ఎలా అనేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.

తొందర పాటు నిర్ణయాలు వద్దు.. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఎన్నికల్లో మద్దతు కోరేందుకు శివరామరాజు కార్యాలయానికి మంగళవారం వెళ్లారు. ఎమ్మెల్యేతో చర్చించేందుకు ఆయన అంగీకరించలేదు. కొద్దిసేపు నిరీక్షించాక రామరాజు వెనుదిరిగారు. అనంతరం భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అక్కడికి వెళ్లి శివరామరాజుతో భేటీ అయ్యారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని.. పార్టీలో సీనియర్‌ నాయకుడిగా మీకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన శివకు సూచించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని