logo

కొల్లేరును శాసిస్తున్న క్యాట్‌ఫిష్‌

అరుదైన నల్లజాతి చేపలకు నిలయమైన  కొల్లేరులో క్యాట్‌ఫిష్‌ సంతతి అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. నిషేధిత ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌, రాక్షస జాతి చేపల ఉద్ధృతితో అరుదైన జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి

Updated : 23 Mar 2024 07:03 IST

అంతరించిపోతున్న అరుదైన నల్లజాతి చేపలు

క్యాట్‌ఫిష్‌

మండవల్లి, న్యూస్‌టుడే: అరుదైన నల్లజాతి చేపలకు నిలయమైన  కొల్లేరులో క్యాట్‌ఫిష్‌ సంతతి అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. నిషేధిత ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌, రాక్షస జాతి చేపల ఉద్ధృతితో అరుదైన జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఎంతో గడ్డు పరిస్థితులను సైతం తమకు అనుగుణంగా మార్చుకొంటూ మనుగడను సాధించే క్యాట్‌ఫిష్‌, రాక్షస జాతి(సైల్పిన్‌ క్యాట్‌ఫిష్‌) చేపలు నానాటికీ పెరుగుతున్నాయి. అతి తక్కువ నీటిలో మనుగడ సాగించే ఈ రెండు జాతులు ఇతర రకాల చేపల్ని వేటాడి తినడంతో కొల్లేరులో సహజ మత్స్య సంపద మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.

రాక్షస జాతి సైల్పిన్‌

  • కొన్నేళ్లుగా కొల్లేరులో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడటంతో ఏటా నల్లజాతి మత్స్య సంపద తరిగిపోతూ వస్తోంది. కానీ బురదలో బతికే స్వభావం ఉన్న క్యాట్‌ఫిష్‌ జాతులు మాత్రం తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. ఇతర చిన్న, పెద్ద చేపల్ని వేటాడి ఆహారంగా తీసుకోవడంతో ఇతర జాతులకు మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.


నష్టపోతున్న మత్స్యకారులు

2006 కొల్లేరు ఆపరేషన్‌ తర్వాత ఎక్కువ మంది మత్స్యకారులు సరస్సులో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ నాలుగేళ్లుగా క్యాట్‌ఫిష్‌ జాతి పెరగడంతో ఇతర చేపలు కనుమరుగవుతున్నాయి. నిషేధిత క్యాట్‌ఫిష్‌, రాక్షస జాతి చేపలకు ఎటువంటి మార్కెట్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నల్ల జాతి చేపల లభ్యత భారీగా తగ్గిపోవడంతో మత్స్యకారులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.   గతంలో కొరమేను, మట్టగిడస, వాలుగు లాంటి వాటితో పాటు గండ్లు, తుళ్లు, తెల్ల చేపలు కొల్లేరు లభ్యమయ్యేవి. కానీ ప్రస్తుతం అవి కనుమరుగయ్యాయి’ అని మణుగునూరు గ్రామానికి చెందిన మత్స్యకారుడు జంగం సుగుణరావు తెలిపారు


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..

మత్స్యకారుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. కొల్లేరులో క్యాట్‌ఫిష్‌ వృద్ధిని అడ్డుకోవడం సాధ్యమయ్యే పనికాదు. రసాయనాలను వినియోగిస్తే ఇతర జాతులకు ముప్పు. మత్స్యకారులే కాస్త జాగ్రత్త వహించి క్యాట్‌ఫిష్‌ జాతులు దొరికినప్పుడు నాశనం చేసేలా చర్యలు తీసుకోవాలి.’ అని మత్స్య శాఖ ఏడీ చాంద్‌బాషా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు