logo

పోలీసులందరూ జగన్‌ సేవకు!

జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు.

Published : 19 Apr 2024 05:05 IST

సిబ్బంది లేక స్టేషన్లు ఖాళీ 
కొరవడిన తనిఖీలు  

మొగల్తూరు, నరసాపురం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో రెండు రోజులుగా సిబ్బంది లేరు. ఒక్కరో.. ఇద్దరో.. విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటన, ఆయన పాల్గొంటున్న సిద్ధం సభలకు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించారు. దీంతో స్టేషన్లలో పోలీసులు అందుబాటులో లేరు. ఇప్పటికే చాలా స్టేషన్లలో చాలినంతమంది లేక అందుబాటులో ఉన్న వారినే రాత్రి, పగలూ విధులకు నియమిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
ఎన్నికల విధులకు కొరత : ఎన్నికల నియమావళి అమలు, రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వినియోగ సామగ్రి, నగదు అక్రమ రవాణా, చలామణి తదితర వాటిని అడ్డుకునేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ ఫ్లయింగ్‌స్క్వాడ్‌ (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్‌ సర్వెలెన్సు టీము (ఎస్‌ఎస్‌టీ)లను నియమించారు. ఇతర విధులకు సిబ్బందిని నియమించారు. వారిలో కొంత మందిని ముఖ్యమంత్రి బందోబస్తు విధులకు మళ్లించినట్లు తెలిసింది. దీంతో తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. పొరుగు జిల్లాల నుంచి ప్రజలు రాకపోకలు సాగించే ముఖ్యమైన ప్రాంతాల్లోనూ తనిఖీలు తూతూమంత్రంగానే ఉన్నాయి. దీనిపై డీఎస్పీ గంటి శ్రీనివాసరావును ‘న్యూస్‌టుడే’ సమాచారం కోరగా ఆయా బృందాలన్నీ వెంటనే ఫోర్సులోకి రానున్నాయన్నారు. నగదు, ఇతర సామగ్రి అక్రమ తరలింపుపై తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని