logo

శోభాయమానం... శ్రీనివాసుడి కల్యాణం

కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది.

Published : 20 Apr 2024 05:53 IST

కల్యాణ క్రతువు నిర్వహిస్తున్న అర్చకులు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమలగా భాసిల్లుతున్న వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి ప్రధానాలయం నుంచి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ తిరుచ్చి వాహనంపై కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి సింహాసనంపై ఆశీనులను చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం మధ్య క్షేత్రపాలకుడు అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరస్వామి సాక్షిగా దేవదేవుని కల్యాణం అద్యంతం కమనీయంగా జరిగింది. వేదిక సమీపంలో వందలాది కిలోల కర్పూరం వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించారు. స్వామివారి రథోత్సవం శోభయమానంగా సాగింది.


వైభవంగా తెప్పోత్సవం

పెంటపాడు న్యూస్‌టుడే: కస్పా పెంటపాడులోని గోపాలస్వామి, ఆంజనేయస్వామి వార్ల దేవస్థానంలో శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఉన్న కృష్ణపుష్కరిణిలో ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు