logo

జోరుగా నామినేషన్లు

ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి.

Updated : 21 Apr 2024 14:51 IST

ఉభయ జిల్లాల్లో శుక్రవారం నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండు జిల్లాల్లో ఎంపీ స్థానాలకు 6, ఎమ్మెల్యేకు 27.. మొత్తం 33 దాఖలయ్యాయి. అనుచర గణం వెంట రాగా ర్యాలీగా ఆయా పార్టీల అభ్యర్థులు తరలివెళ్లి నామపత్రాలను సమర్పించారు. అందులో తమ ఆస్తులు, అప్పులు, కేసులను వివరించారు.

న్యూస్‌టుడే బృందం


ఉండి బరిలో రఘురామ

ఉండి, న్యూస్‌టుడే: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి   బరిలో దిగనున్నారు. రఘురామ తరఫున నామపత్రాలను ఆయన సతీమణి రమాదేవి శుక్రవారం దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండి మండల రెవెన్యూ కార్యాయానికి వచ్చిన ఆమె ఆర్వో  ప్రవీణ్‌ ఆదిత్యకు నామ పత్రాలు దాఖలు చేశారు.


తణుకు

మంత్రి కారుమూరికి రూ.35.58 కోట్లు

తణుకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన భార్యకు కలిపి రూ.35.58 కోట్ల స్థిర, చరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బెంగళూరులో రూ.6.57 కోట్ల విలువైన ఇల్లు, జి.చోడవరంలో 15.35 ఎకరాలు, వెంకట్రామన్నగూడెంలో 8.30 ఎకరాలు, అత్తిలిలో 0.71 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. రూ.94.65 లక్షల విలువైన బంగారం, వెండి అభరణాలున్నాయి. రూ.20 లక్షల విలువైన కారు ఉంది. రూ.55 లక్షల అప్పు ఉన్నట్లు చూపించారు.


నరసాపురం

ప్రసాదరాజు కుటుంబ ఆస్తులు  రూ.3.39కోట్లు

ముదునూరి

అభ్యర్థి పేరు: ముదునూరిప్రసాదరాజు
పార్టీ: వైకాపా
విద్యార్హత: ఇంటర్మీడియట్‌
కేసులు: ఏమీ లేవు
చరాస్తుల విలువ మొత్తం: రూ.57,72,182, కుమారుడు పేరున: రూ.7,39,314
స్థిరాస్తుల విలువ : రూ.59,41,100, కుమారుడు పేరున: రూ.16,56,000
సొంత ఇంటి విలువ: రూ.29.60 లక్షలు
బంగారం విలువ: రూ.7.80 లక్షలు, భార్యకు : రూ.35.75 లక్షలు
వెండి: రూ.3.60లక్షలు
అప్పులు: 1,83,09,626, భార్యపేరున: 12,38,419
వాహనాలు: మహీంద్ర ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్‌ రూ.లక్ష విలువ, కియా కారు: రూ.34.54 లక్షలు, భార్యపేరున: ఫోర్డు కారు విలువ: రూ.20.35లక్షలు, యాక్సిస్‌ ద్విచక్రవాహనం విలువ: రూ.20వేలు  


భీమవరం

గ్రంధికి రూ.25.2 కోట్ల ఆస్తులు

శ్రీనివాస్‌

భీమవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య పేరు మీద రూ.4.99 కోట్ల చరాస్తులు, రూ.20.2 కోట్ల విలువైన స్థిరాస్తులు కలిపి రూ.25.2 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. తెలంగాణలోని మల్కాజిగిరి జిల్లాలో 2ఎకరాలు, విస్సాకోడేరులో 5.75 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 14.12 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. చెన్నైలో రూ.4కోట్ల విలువైన వ్యాపార భవనాలు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. రూ.76.5 లక్షల విలువైన నివాస భవనాలున్నాయి. రూ.1.03 కోట్ల విలువైన బంగారు ఆభరణాలున్నాయి. రూ.39.6 లక్షల విలువైన ఫోర్డ్‌ ఎండోవర్‌ కారు ఉంది. ఇద్దరు పేరు మీద కలిపి రూ.12.5 కోట్ల అప్పులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.


నరసాపురం పార్లమెంట్‌

అభ్యర్థి పేరు: గూడూరి ఉమాబాల
పార్టీ:  వైకాపా
విద్యార్హతలు: బీఎస్సీ, బీఎల్‌
కేసులు: గతంలో ఉన్నాయి (కుటుంబ వ్యవహారాలకు సంబంధించినవి)
చరాస్తుల విలువ: రూ.45,00,521, భర్త పేరిట - రూ.60,91,678   
స్థిరాస్తుల విలువ: రూ.7,50,06,300, భర్త పేరిట - రూ.32,48,000
బంగారం విలువ: రూ.32,04,000, భర్త పేరిట - రూ.3,12,000
వాహనాలు: భర్త పేరిట - ఎంజీ హెక్టార్‌ కారు, విలువ - రూ.31,82,373  ః అప్పులు: లేవు, భర్త పేరున - రూ.15,32,921


నియోజకవర్గం: తణుకు

అభ్యర్థి పేరు: ఆరిమిల్లి రాధాకృష్ణ
పార్టీ: తెదేపా
విద్యార్హతలు: ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌
కేసులు: 7
చరాస్తుల విలువ మొత్తం: రూ.4,22,80,548
భార్య పేరిట: రూ.6,28,10,701
స్థిరాస్తి విలువ మొత్తం: రూ.14,49,12,700, భార్య పేరిట: రూ.4,03,83,200
సొంతింటి విలువ: రూ.2,42,15,500
బంగారం విలువ: రూ.20,80,000, భార్య పేరున: 1,27,09,500
వెండి: రూ.42 లక్షలు
వాహనాలు: టాటా సఫారి రూ.4,29,653, ఫోర్డ్‌ ఎన్డీవీయర్‌ రూ.18,46,394. భార్య పేరున: మెర్సిడెస్‌ బెంజ్‌ రూ. 28,11,144.
అప్పులు: రూ.1,12,98,454 భార్య పేరున: రూ.13,28,832  


ఆచంట

అభ్యర్థి పేరు: పితాని సత్యనారాయణ
పార్టీ:తెదేపా
విద్యార్హత: డిగ్రీ
కేసులు: 2"
చరాస్తులు: రూ.2,21,50,183, భార్య పేరిట: రూ.2,06,10,900
స్థిరాస్తులు: 8,12,01,000, భార్య పేరిట: 1,45,80,000
అప్పులు: 2,50,00,000, భార్య పేరిట: రూ.22,00,700


పాలకొల్లు

పేరు: నిమ్మల రామానాయుడు
పార్టీ: తెదేపా
విద్యార్హత: ఎంఎ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ
కేసులు: 25
చరాస్తుల విలువ మొత్తం: రూ.1.70 కోట్లు, భార్య పేరున రూ.96 లక్షలు
స్థిరాస్తుల విలువ మొత్తం: రూ.3,16,70,000, భార్య పేరిట రూ.3,11,96,000
సొంత ఇంటి విలువ: రూ.50 లక్షలు
బంగారం: రామానాయుడు పేరిట రూ.36,38,013, భార్య సూర్యకుమారి: 1,17,32,393  ః అప్పులు: రూ.74,135
వాహనాలు: ఇన్నోవా విలువ రూ. 12లక్షలు


తాడేపల్లిగూడెం

అభ్యర్థిపేరు: బొలిశెట్టి శ్రీనివాస్‌
పార్టీ: జనసేన
విద్యార్హతలు: బీకాం
కేసులు: 4
చరాస్తుల విలువ మొత్తం: రూ.15,92,65,013.75, భార్య పేరున: 7,08,950
స్థిరాస్తి విలువ మొత్తం: రూ.6,04,45,663. భార్య పేరున: రూ.2,27,83000
బంగారం విలువ: రూ.3,40,250, భార్య పేరున: రూ.6,80,500
అప్పులు: రూ.17,18,02,665.99, భార్యపేరున: ఏమీ లేవు
వాహనాలు: కియా కారు, ఇతర వాహనాలు రూ.98,92,173, భార్య పేరున: ఏమీ లేవు


అచంట

రంగనాథరాజుకు రూ.65.7 కోట్ల ఆస్తులు

ఆచంట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ రంగనాథరాజు, భార్య వైజయంతి పేరు మీద చరాస్తులు విలువ రూ.5.7కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.35.4 కోట్లు కలిపి మొత్తం రూ.41 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. ఉమ్మడి ఆస్తులు కూడా కలిపితే రూ.65.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. భీమడోలు మండలంలో భార్య పేరుపై 7.20 సెంట్ల స్థలం, ప్రత్తిపాడులో రైస్‌ మిల్లు, ఏలూరు, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో గిడ్డంగులు, రూ.25 లక్షల విలువైప బెంజి, రూ.70 లక్షల విలువైన రేంజ్‌ రోవర్‌, రూ.15 లక్షల విలువైన ఫోర్డ్‌ కార్లు ఉన్నాయి. ఆయన పేరు రాజానగరంలో భవనాలున్నాయి.


ఉండి

పీˆవీఎల్‌ ఆస్తులు రూ.11.76 కోట్లు

ఉండి నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పీవీఎల్‌ నరసింహరాజు తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
తన పేరిట రూ.11.76 కోట్ల విలువైన, భార్య పేరిట రూ.87.12 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో తనకు రూ.2.85 కోట్లు, భార్య పేరిట రూ.29.98 లక్షల విలువైన రుణాలు ఉన్నట్లు వెల్లడించారు.
వివిధ సంస్థల్లో ఈక్విటీ షేర్లు, బీమా పాలసీలు, కియా సెల్‌టాస్‌ కారు, బంగారు ఆభరణాలు ఉండగా వాటి విలువ రూ.2.97 కోట్లుగా పేర్కొన్నారు. భార్య నిర్మల పేరిట రూ.2.06 కోట్ల పెట్టుబడులున్నాయని పేర్కొన్నారు.
యండగండిలో రూ.8.01 కోట్ల విలువైన 17.81 ఎకరాలు, విజయనగరం జిల్లాలో రూ.31.70 లక్షల విలువైన 6.34 ఎకరాల వ్యవసాయ భూములు, యండగండిలో రూ.20.81 లక్షల విలువైన వ్యవసాయేతర భూములున్నాయని తెలిపారు. యండగండిలో నివాస భవనం ఉందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో రూ.2.25 కోట్ల విలువైన ఇల్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని