logo

కరవు భత్యానికీ కరవే

అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్‌ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్‌ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Published : 20 Apr 2024 06:32 IST

ఉపాధ్యాయులను వంచించిన ప్రభుత్వం
ఒక్కొక్కరికీ  రూ.లక్ష నుంచి  2 లక్షల వరకు బాకీ

ఈనాడు డిజిటల్‌, భీమవరం, తణుకు: అధికారంలోకి వచ్చేందుకు అయిదేళ్ల కిందట జగన్‌ చెప్పని మాట లేదు... ఇవ్వని హామీలేదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్‌ మాట పక్కన పెడితే కనీసం ఉపాధ్యాయులకు రావాల్సిన కరవుభత్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీతాలు ఎలాగూ సమయానికి రావడం లేదు. కనీసం   ఆర్థిక బకాయిలనైనా విడుదల చేయాలని అనేక సార్లు రోడ్డెక్కి ఉద్యమాలకు దిగితే వారిపై ఉక్కుపాదం మోపారు.  

ఉమ్మడి జిల్లాలో 3,160 పాఠశాలల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారి జీతభత్యాలను బట్టి ఒక్కొక్కరికి కనీసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు కరవుభత్యం సొమ్ములు రావాల్సి ఉంది. పీఆర్‌సీ సమయంలో పాత డీఏలను చెల్లించి జీతాలు పెరిగాయని మభ్యపెట్టిన ప్రభుత్వం అడుగడుగునా ఉపాధ్యాయులను ఏదో రూపంలో వంచిస్తూ వచ్చింది. గతంలో కరోనా సాకుతో రెండు డీఏలు మాఫీ చేశారు. ఆర్నెళ్లకోసారి జనవరి, జులైల్లో డీఏ చెల్లించాల్సి ఉన్నా ఆ ప్రకారం ఇవ్వడం లేదు. వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామన్నా అదీ అమలు కాలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాత బకాయిలను  చెల్లించకుండా ఎన్నికల నేపథ్యంలో జనవరి 1, 2023న చెల్లించాల్సిన డీఏను ఈ ఏడాది మార్చి జీతం కలిపి విడుదల చేశారు. జులై 1, 2023 డీఏను ఈ ఏడాది ఆగస్టులో చెల్లిస్తామని జీవో విడుదల చేశారు. 2023 నుంచి డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తానన్నా ఇవ్వలేదు.


ఏనాడూ పట్టించుకోలేదు

- ఐ.రాజగోపాల్‌, ఏపీటీఎఫ్‌ మాజీ కార్యదర్శి, తణుకు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏనాడూ ఉపాధ్యాయులను పట్టించుకోలేదు. భావితరాలను తీర్చిదిద్దాల్సిన వారిని ఇతర విధులకు కేటాయించి వారిపై కక్షపూరితంగా వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఎప్పుడూ సకాలంలో చెల్లించలేదు.


హామీలతో మభ్యపెట్టారు

భీమవరంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు(పాతచిత్రం)

అమలుకాని హామీలిచ్చి మభ్యపెట్టారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డీఏలను చెల్లించాల్సి ఉన్నా వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. పీఆర్‌సీ కోసం ఉపాధ్యాయులను రోడ్డెక్కించిన ఘనత ఈ ప్రభుత్వానిదే.కరవుభత్యాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించడం శోచనీయం. - విష్ణుమూర్తి, యూటీఎఫ్‌ నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు