ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు.
ఉద్యోగులు అప్లోడ్ చేసిన చిత్రం
జీలుగుమిల్లి, న్యూస్టుడే: ‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. ఈ నెల 23న 6 గ్రూపులకు చెందిన సుమారు 60 మంది కూలీలు తాటియాకులగూడెం పంచాయతీ పరిధి బర్రింకలపాడు చెరువు వద్ద పనులు చేశారు. వారికి మస్టర్లు వేసి, పని చేస్తున్న చిత్రాలూ సంబంధిత పేజీలో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో ఉద్యోగులు కూలీలకు బదులు చెరువు వద్ద సేద తీరుతున్న గేదెల చిత్రాలు పెట్టారు. ఇలా ఒకటి కాదు.. ఏకంగా 6 పేజీల్లో అలాంటి చిత్రాలనే అప్లోడ్ చేసి జిల్లా యంత్రాంగానికి పంపారు. మండల స్థాయిలోనూ ఈ తప్పిదాన్ని గుర్తించలేదు.
ఉపాధి కూలీల పేర్లతో ఉన్న గేదెల ఫొటో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!