logo

2న రాయచోటి, కడపలో చంద్రబాబు సభలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు.

Published : 29 Apr 2024 03:59 IST

3న రాజంపేటలో నారా లోకేశ్‌ పర్యటన

ఈనాడు, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. మధ్యాహ్నం రాయచోటిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న చంద్రబాబు సాయంత్రం కడప నగరానికి చేరుకుని రోడ్‌షోలో పాల్గొని అనంతరం ప్రజాగళం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. వచ్చే నెల 3న రాజంపేటకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రానున్నారు. యువతతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నుంచి రెండు జిల్లాల నేతలకు సమాచారం అందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని