పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, చిత్రంలో డీఆర్వో పెంచల కిషోర్
తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బంది కోసం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత ఆర్వోలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం డీఆర్వో పెంచల కిషోర్ తదితర అధికారులతో కలిసి ఏడు నియోజకవర్గాలకు చెందిన అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బంది ఫారం 12, 12డీ సమర్పించి నిర్ణీత కేంద్రాల్లో ఓటు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో సంబంధిత బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. డీఎల్డీవో సుశీలాదేవి, జిల్లా సమాచార, పౌరసంబంధాల అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లోకి సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగం సూచనలు చేశారు.
- 'మీ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు, దాని కోడ్ నంబర్ తెలుసుకోవాలి. మీ ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ నంబర్ ఓటరు జాబితాలో మీ ఓటు క్రమసంఖ్య తెలుసుకోవాలి.
- ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లిన తర్వాత 13ఏ డిక్లరేషన్, 13బి కవర్ ఏ, 13సి కవర్ బి, ఫాం-13డి సూచనలు, బ్యాలెట్ ఇస్తారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిచేయాలి.
- 13ఏ పూరించి అందులో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్ తప్పక రాయాలి. మీ సంతకం, గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. గెజిటెడ్ అధికారి అక్కడే అందుబాటులో ఉంటారు.
- 13బి(ఏ ఇన్నర్ కవర్) పూర్తి చేయాలి. 13బిలో కూడా మీ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబరు తప్పక రాయాలి. అలా వేయకుంటే అది ఇన్వ్యాలిడ్ అవుతుంది. టిక్ చేసిన బ్యాలెట్ అందులో పెట్టి సీల్ వేయాలి.
- 13సి ఔటర్ కవర్లో 13బి ఇన్నర్ కవరును, 13ఏ డిక్లరేషన్ ఉంచి సీల్ చేసి కవర్‌పై వివరాలు పూర్తిచేయాలి. ఆపై అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్‌లో పోస్టల్ బ్యాలెట్ కవర్ వేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్ భూతం.. ఆడితే ఖతం
[ 02-06-2024]
శాసనసభ పోరులో గెలుపోటములపై పందేల వేట సాగిస్తున్నారు. ఈ ఊబిలోకి సామాన్యులను సైతం వైకాపా ముఠాలు దించుతున్నాయి. వారిని ఆర్థికంగా కుంగదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. -
వసతి గృహాల్లో సమస్యల స్వాగతం
[ 02-06-2024]
ముఖ్యమంత్రి జగన్ ఏ సభ, సమావేశం జరిగినా మైక్ పట్టుకుని ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు’ అంటూ పల్లవి పాడుతుంటారు. -
లెక్కలు తేలే రోజుకు కౌంట్‌డౌన్
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. జిల్లాలో ఒక లోక్‌సభ స్థానం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలైన ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. -
ఖాతాల్లోనే పింఛన్ మొత్తం
[ 02-06-2024]
సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారుల కష్టాలు జూన్‌లోనూ కొనసాగాయి. ఎన్నికల్లో లబ్ధే లక్ష్యంగా ప్రభుత్వం రెండు నెలలుగా పింఛనర్లను ఇబ్బందులకు గురిచేయడంపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. -
తెదేపా సానుభూతిపరులపై అదే ప‘నిఘా’
[ 02-06-2024]
దాడులకు తెగబడే వారిని నియంత్రించాల్సిన పోలీసులు.. బాధితులపైనే నిఘా పెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్‌పై పేచీ తొలగినట్లేనా?
[ 02-06-2024]
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇక అందరి కళ్లు పోస్టల్ బ్యాలెట్లపై పడనున్నాయి. -
ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలి
[ 02-06-2024]
చిత్తూరు లోక్‌సభ స్థానం ఓట్ల లెక్కింపులో అధికారులు జాగ్రత్తగా ఉండాలని జేసీ శ్రీనివాసులు అన్నారు. -
విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి రెండు కాళ్లు కోల్పోయిన విద్యార్థి
[ 02-06-2024]
బంగారు భవిష్యత్తు కలిగిన ఓ విద్యార్థి విద్యుత్తు శాఖ నిర్లక్ష్యానికి తన రెండు కాళ్లు కోల్పోయాడు. -
గాలివాన బీభత్సం
[ 02-06-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం పెనుగాలుల వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండ వేడిమి వల్ల ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. -
పోలీసులు సంసిద్ధంగా ఉండండి: ఎస్పీ
[ 02-06-2024]
చిత్తూరు నగరంలోని ఎస్వీసెట్ కళాశాలలో ఈ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పోలీసు అధికారులు సంసిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.