logo

TG Congress: కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా?: మహేశ్‌కుమార్‌గౌడ్‌

Eenadu icon
By Telangana Dist. Team Published : 12 Jul 2025 14:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్: కుల సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. కీలకమైన ఈ నిర్ణయాలను అభినందించేందుకు కూడా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు మనసు రావడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.. విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు.

‘‘గతంలో ఎన్నో బిల్లుల విషయంలో భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. బీసీలకు మేలు జరిగే నిర్ణయంపై మాత్రం కేసీఆర్ నోరు విప్పడం లేదు. కడుపునిండా విషం పెట్టుకొని కౌగిలించుకొన్నట్లుగా విపక్షాల ధోరణి ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఏనాడూ దృష్టి పెట్టలేదు. మేం సాధించిన రిజర్వేషన్ల పెంపును.. కవిత తన విజయంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను మేము చేపట్టినప్పుడు కవిత జైలులో ఉన్నారు. తిహాడ్‌ జైలులో ఉన్న కవిత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలి. ఆమె మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆమెకైనా స్పష్టత ఉందా?’’ అని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని