టక్కరి దొంగ.. పోలీసులతోనే ఉపాధి పొంది మస్కా కొట్టి చోరీలు
అతను దొంగ.. సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు.. నిజంగా మార్పు రాలేదు.
సీసీ కెమెరాలో పాత నేరస్థుడు వెంకటరమణ
ఘట్ కేసర్, న్యూస్‌టుడే: అతను దొంగ.. సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు.. నిజంగా మార్పు రాలేదు. పైగా ఇంకా దొంగతనాలు చేయాలనే కోరిక పెరిగింది. గత మూడేళ్లుగా చేస్తూ పోలీసులకు సవాలుగా మారాడు. పోచారం ఐటీకారిడార్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు, కాలనీవాసులకు కంటి మీద నిద్ర లేకుండా చేశాడు. గతనెల 29న ‘ఈనాడు’లో ‘తాళం వేసుందా.. సొమ్ముగోవిందా..!’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీసులు దొంగను పట్టు కోవడానికి ఐదు బృందాలు ఏర్పాటు చేసి చివరకు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో బీరప్పగడ్డలో నివాసం ఉంటున్న వెంకటరమణగా గుర్తించి పట్టుకున్నారు. గతంలో పదుల సంఖ్యలో చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. బయటకు వచ్చాక ఉపాధి లేకనే దొంగతనం చేశా..జీవనోపాధి కల్పించాలని కోరడంతో అప్పటి రాచకొండ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉప్పల్ ఠాణా పక్కన దాతల సాయంతో హోటల్ ఏర్పాటు చేయించి తానే ప్రారంభించారు. మూడేళ్ల పాటు హోటల్ నిర్వహించి.. తర్వాత కనిపించకుండా పోయాడు.
తప్పించుకునే ‘కళ’: మిర్యాలగూడ, కోదాడ, సిద్ధిపేట, పోచారం ఐటీకారిడార్, ఘట్కేసర్, తదితర పోలీసు స్టేషన్ పరిధిల్లో చోరీలు చేస్తూనే ఉన్నాడు. టోపీ, మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి, కుడికాలు కుంటుతూ (వికలాంగుడు కాదు) చోరీలు చేసేవాడు. అనుభవం ఉండటంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
జైలుకెళ్లినా మార్పు రాలె..!
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ..
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
యాప్‌లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.